రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ కీ… గోరంట్ల నుంచి ఆ ముగ్గురు సెలెక్ట్.
…… జిల్లా కమిటీలోని 14 మందిలో… గోరంట్ల నుంచి ప్రిన్సిపల్ భక్తవత్సలం, టీచర్ జగదీష్, పవిత్ర ఎంపిక.
గోరంట్ల మే 03 సీమ వార్త
శ్రీ సత్య సాయి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నూతన నియామకాల భాగంగా గోరంట్ల మండలం నుంచి ముగ్గురికి ప్రాధాన్యతనిస్తూ ఎంపిక చేసినట్లు కలెక్టర్ చేతన్ ప్రకటించారు. ఈ సందర్భంగా గోరంట్ల మండలం నుంచి ఎస్ పి వి ఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భక్తవస్థలం , ప్రభుత్వ ఉపాధ్యాయులు దేవాంగం జగదీష్, సమాజ సేవకురాలు పవిత్ర లను ఎంపిక చేసినట్టు ప్రకటించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు జి ఎం శేఖర్ చైర్మన్ గా ఏర్పడిన శ్రీ సత్య సాయి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి జిల్లా కలెక్టర్ చేతన్ చే 14 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. అందులో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భక్తవత్సలం ని, రాష్ట్ర ఉత్తమ అవార్డ్ గ్రహీత దేవాంగం జగదీష్ ని మరియు ఎస్ సి ఎస్టీ డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ పవిత్ర ని గోరంట్లకు చెందిన ముగ్గరికి రెడ్ క్రాస్ సొసైటీ కమిటీలో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ నియామకం పట్ల వీరు సంతోషం వ్యక్తం చేస్తూ తమ బాధ్యత మరికొంత పెరిగిందని సమాజానికి మరింత సేవ చేయుటకు అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ చేతన్ కి, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జి ఎం శేఖర్ కి మరియు స్టేట్ కమిటీ సభ్యులు శ్రీ విశ్వనాథ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.