……వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు కి వ్యతి రేకంగా ముస్లింల శాంతియుత నిరసన
గోరంట్ల సీమ వార్త అప్డేట్ న్యూస్..
గోరంట్ల పట్టణం లోని జమియత్ ఉలమా- ఏ హింద్ ఆధ్వర్యంలో అన్ని మసీదులలో శుక్రవారం నమాజు తర్వాత, కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు ముస్లిం సమాజానికి చాలా అన్యాయం చేకూర్చేలా ఉన్న ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ గోరంట్ల పట్టణంలోని అన్ని మసీదులలో కుడి చేతికి నల్ల బ్యాడ్జి కట్టుకొని ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు కి వ్యతిరేకంగా ముస్లింలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రతి మసీదు యొక్క కమిటీ పెద్దలు, జమియత్ ఉలమా సభ్యులు మత పెద్దలు, యువకులు మరియు గోరంట్ల ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.