ఉరి వేసుకొని… బూదిలి లో యువతి ఆత్మహత్య.
గోరంట్ల మార్చి 20 సీమ వార్త
మండలంలోని బూదిలి గ్రామంలోని హరిజనవాడకు చెందిన నరసింహప్ప కుమార్తె
విమల (23) గురువారం తమ నివాసంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు కొంతకాలంగా కుటుంబ జీవన నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా మృతురాల విమల ను తమ మేనమామ కిష్టప్ప ఇంట్లో ఉంటూ గోరంట్లలో ఓ పాఠశాలలో ప్రైవేటు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం తన నివాసంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనను కొంత ఆలస్యంగా గుర్తించిన కూటమికులు హుటా కొట్టిన ఆమెను గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు డాక్టర్ వినోద్ నిర్ధారించారు.ఈ సంఘటనపై మేనమామ మాట్లాడుతూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని అంతకుమించి ఎలాంటి సమస్యలు లేవని ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని ఆయన అన్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.