కన్నవారి జ్ఞాపకార్థం నిర్వహించిన…..మెగా బ్లడ్ క్యాంపు విశేష ఆదరణ.
…. వాసవి మహల్ లో నిర్వహించిన బ్లడ్ క్యాంపుకు …..రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ జిఎం శేఖర్ ముఖ్యఅతిథిగా హాజరు.
గోరంట్ల ఏప్రిల్ 19 సీమ వార్త
గోరంట్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోరంట్ల ఆర్యవైశ్య అధ్యక్షులు బలరాం గుప్తా తల్లి తండ్రులు వెంకట లక్ష్మమ్మ నూకల ఈశ్వరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి జ్ఞాపకార్థం శ్రీ సత్య సాయి జిల్లా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమము నకు ముఖ్య అతిథిగా శ్రీసత్య సాయి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ & శ్రీ సత్య సాయి జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ జి యం శేఖర్ ,రెడ్ క్రాస్ కార్యదర్శి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ విశ్వనాథ్ , బ్రహ్మ కుమారి మాత ఉమాదేవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేశం లో ని 140 కోట్ల మంది లో కేవలం 37% శాతం మాత్రమే అర్హులైన బ్లడ్ డోనర్స్ ఉన్నారు కానీ కేవలం 10% లోపు మాత్రమే బ్లడ్ డొనేట్ చేస్తున్నారు.హాస్పిటల్ కు వెళ్లే ప్రతి 100 లో 7 మందికి బ్లడ్ అవసరం ఉంటుంది. ఒకరు రక్త దానం చేస్తే 4 గురు ప్రాణాలు కాపాడిన వారవుతారు. పురుషులు ప్రతి 2 లేదా 3 నెలలకు ఒకసారి మహిళలు 4 లేదా 5 నెలల కు ఒకసారి రక్త దానం చేయవచ్చు.
అందుకే రక్త దానం చేయండి – ప్రాణ దాతలు అవ్వండి అని పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమము ఏర్పాటు చేసిన బలరాం గుప్తా కి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వాసవి యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.