Monday, March 2, 2026
Homeసీమా వార్తకుమార్, నరేష్ ల మానవత్వం… 120 మంది స్టూడెంట్స్ కు వరం.

కుమార్, నరేష్ ల మానవత్వం… 120 మంది స్టూడెంట్స్ కు వరం.

📰 Generate e-Paper Clip

కుమార్, నరేష్ ల మానవత్వం… 120 మంది స్టూడెంట్స్ కు వరం.

….. పంచాయతీలోని 120 మంది విద్యార్థులకు..విద్య సామాగ్రి పంపిణీ.

…. కొండాపురం పంచాయతీ గ్రామాల్లో దాతృత్వం చాటుకున్న టిడిపి నేత కుమార్, నరేష్ సోదరులు.

…. సింగిల్ విండో అధ్యక్షులు రవి మోహన్ చేతుల మీదుగా అందజేత.

సీమ వార్త అప్డేట్… గోరంట్ల.

మండలంలోని కొండాపురం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెడ్డి చెరువు కట్ట కు చెందిన టిడిపి నేత కుమార్ సొంత ఖర్చులతో సమకూర్చిన విద్య సామాగ్రిని అన్ని గ్రామాల విద్యార్థులకు అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు గౌని వారి పల్లి సింగిల్ విండో అధ్యక్షులు రవి మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్దల కుంటపల్లి, రాగి మేకలపల్లి, కొండాపురం, మల్లెల గ్రామాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెడ్డి చెరువు కట్ట స్వర్గీయ బావయ్య కుమారుడు కుమార్ విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు, బలపాలు, పెన్సిల్లు అందచేయడం జరిగింది. పిల్లలు ఉపాధ్యాయులు కుమార్ ను అభిందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అమర్, డ్రైవర్ శ్రీనివాసులు, డీలర్ చంద్ర శేఖర్, సాగునీటి సంఘం అధ్యక్షుడు గాజుల వేణుగోపాల్, టీడీపీ నేత నీరుగంటి నరసింహులు, రాగి మేకలపల్లి సూరి,టీడీపీ యువ నేత మల్లెల నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్, టీడీపీ యువ నేత . నరేష్. మడిచెక్కల ఓబులేసు, ప్రతాప్, రాంపురం శ్రీనివాసులు, చలమయ్య గారి పల్లి సురేష్, కొండాపురం గంగాధర, మంజు,శేషు తెలుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular