నవమి నాడు… జిల్లా స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు.
…. గోరంట్ల మండలం కరావులపల్లి తండా వద్దగల ఆంజనేయస్వామి విగ్రహం గుడి వద్ద కార్యక్రమాలు
…. ఆలయ ధర్మకర్త శంకర్ లాల్ నాయక్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీల నిర్వహణ.
…. మార్చి 6న జరగబోవు నవమి నాటి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు.
గోరంట్ల మార్చి 14 సీమ వార్త
మండలంలోని కరావులపల్లి తాండ సమీపంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని జరిగే ప్రత్యేక వేడుకల్లో భాగంగా జిల్లాస్థాయిలో ఎడ్ల బండ్ల పోటీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త శంకర్ లాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కరవలపల్లి తండాలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో శంకర్ లాల్ నాయక్ తో పాటు గంపల రమణారెడ్డి, పాలే జయరాం నాయక్, రాజేష్ నాయక్, నాగే నాయక్, చింత రామచంద్రారెడ్డి, వాసు నాయక్, రవి నాయక్, వెంకట శివారెడ్డి, కన్నా రెడ్డి, ముసలి రెడ్డి, ఖాజాపురం నారాయణస్వామి, చింతా భాస్కర్ రెడ్డి, టీచర్ శివయ్య తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శంకర్ లాల్ నాయక్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 న జరగబోవు ఎడ్లబండ్ల పోటీల కార్యక్రమాలకు శ్రీరామనవమి వేడుకలకు పెద్ద ఎత్తున భక్తాదులు ప్రజలు ఎడ్లబండ్ల పోటీ ధరలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 70 వేలు, మూడవ బహుమతిగా 50 వేలు నాలుగవ బహుమతిగా 40 వేలు ప్రోత్సాహకరంగా అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగినాయన చెరువు సర్పంచ్ ఆంజనేయులు, శంకర్ రెడ్డి, శంకర్ నాయక్, గంగాధర్ నాయక్, బూచేపల్లి నాగభూషణ, గోవింద్ రెడ్డి, పెడబల్లి శ్రీనివాస్ నాయక్, మల్లికార్జున, విశ్వనాథ నాయక్, లాయర్ సత్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.