గంగాధర్, ప్రమీల దంపతులచే…. కైవారం తాతయ్య జయంతి వేడుకలు.
… కట్ల మిషన్ గంగాధర్, ప్రమీల దంపతుల చే అన్నదాన కార్యక్రమాలు.
…. ముఖ్యఅతిథిగా హాజరైన ఆదికాయక యోగి స్వామీజీ… దేవి స్వామి ఆధ్వరంలో పూజలు.
గోరంట్ల పట్టణ సమీపంలోని గుమ్మయ్య గారి పల్లి వద్దగల మారెమ్మ ఆలయంలో శుక్రవారం కైవారం తాతయ్య జయంతి వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కర్ణాటక ప్రాంతానికి చెందిన ఆధికాయక యోగి స్వామీజీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మారెమ్మ గుడి ఆలయ వ్యవస్థాపకులు దేవి స్వామి పరివేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గోరంట్ల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి కట్టు మిషన్ గంగాధర్ ప్రమీల దంపతుల ఆర్థిక సాయంతో ఆలయ ప్రాంగణంలో అన్నదానం, మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్ల వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు కట్ల మిషన్ గంగాధర్ ప్రమీల దంపతులు ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖులకు పూల మాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కైవారం తాతయ్య జయంతి వేడుకల్లో భాగంగా భజనలు, కైవారం తాతయ్య కీర్తనలు, గో పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అర్చకులు దేవి స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కొండమ రాజు, సింగిరెడ్డిపల్లి శంకర తదితరులు పాల్గొన్నారు.