seemavartha.com
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 8:39 am Digital Edition : SEEMA VARTHA DESK

చంద్రన్న స్టేట్ టీం లో… నిమ్మల ఫ్యామిలీ

… నిమ్మల అంబరీష్ కు రాష్ట్ర కార్యదర్శిగా ఛాన్స్.

….నాడు యువ గళం లో లోకేష్ వెంట అంబరీష్….ఫలితమే నేడు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

…. విభజన అనంతర నాయకత్వం… నిమ్మల అంబరీష్ కేనా.

…..హర్షం వ్యక్తం చేస్తున్న క్షేత్రస్థాయి పార్టీ శ్రేణులు.

సీమ వార్త అప్డేట్…

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు నిమ్మల అంబరీష్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ లో కీలకమైన పదవికి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేయడంపై క్షేత్రస్థాయి పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. రాష్ట్ర సీనియర్ పార్టీ నాయకులు నిమ్మల కిష్టప్ప కుమారుడు నిమ్మల అంబరీష్ గత ఎన్నికల ముందు నారా లోకేష్ చేపట్టిన యువ గళం లో కీలక పాత్ర పోషిస్తూ పాదయాత్ర చేపట్టిన నాటి నుంచి ముగిసే వరకు అంబరీష్ లోకేష్ మెంట పాదయాత్ర చేసి వారి మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సాధించడంలో అంబరీష్ అప్పట్లో సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఎన్నికల్లో భాగంగా పార్టీ సీనియర్ నేత నిర్మల కిష్టప్ప కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ నిమ్మల అంబరీష్ కు రాష్ట్ర కార్యదర్శిగా పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందనేదానికి ఈ సంఘటననే నిదర్శమని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా నియోజకవర్గాల విభజన కాబోతున్న నేపథ్యంలో నిమ్మల కిష్టప్ప కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన పెద్ద కుమారుడు అంబరీష్ కు కీలకమైన పదవి ఇవ్వడంపై భవిష్యత్తు పగ్గాలు అంబరీష్ కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.