ఢిల్లీ గడ్డ లో…. వాల్మీకి పిఠాధిపతి తో గోరంట్ల ” లక్కీ” భేటీ.
…. ఢిల్లీలో జరిగిన మేధావుల సదస్సులు పాల్గొన్న… వాల్మీకి రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ.
గోరంట్ల మార్చి 16 సీమ వార్త
ఢిల్లీలో జరిగిన మేధావుల సదస్సు లో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు
ముఖ్య అతిథిగా విచ్చేసిన మధ్యప్రదేశ్ వాల్మీకి పీఠాధిపతి బిజెపి రాజ్యసభ సభ్యులు ఉమేష్ నాథ్ మహారాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బోయ లక్ష్మీనారాయణ పీఠాధిపతిని మర్యాదపూర్వ కలిసి ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి భారత ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రమంత్రి అమీషా దృష్టికి తీసుకెళ్లాలి దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీలుగా వున్నాము ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు బీసీలుగా, ఐదు జిల్లాల్లో ఎస్టీలుగా ఓకే రాష్ట్రంలో రెండు రిజర్వేషన్లుగా కొనసాగుతున్నారని ఈ వ్యత్యాసాన్ని తొలగించి తమకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని తమ సమస్యను పరిష్కరించాలని వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాల్మీకి రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, రాష్ట్ర మీడియా ఇంచార్జ్ పామిడి గోపాల్, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు మురళి, యూత్ లీడర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు