నాటి గోరంట్ల తహసీల్దార్…..శ్రీనివాస్ కు సూపర్ ఛాన్స్.
…..మంత్రి కందుల దుర్గేష్ కు…..ఓ ఎస్ డీ గా శ్రీనివాసులు కు బాధ్యతలు
పుట్టపర్తి డెస్క్ ఏప్రిల్ 18 సీమ వార్త
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ఓ ఎస్ డీ గా శ్రీనివాసులు నియమితులయ్యారు. కర్నూలు జిల్లా సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ గా ఉన్న ఆయన మంత్రి ఓ ఎస్ డీ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు శ్రీనివాసులు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి దుర్గేష్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.అనంతపురం నగరానికి చెందిన శ్రీనివాసులు గతంలో శ్రీ సత్య సాయి జిల్లాలోని గోరంట్ల, హిందూపురం మండలాల్లో తాసిల్దార్ పని చేశారు. రెండేళ్ల క్రితం శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో తన విధి నిర్వహణలో అంచలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రస్థాయిలో మంత్రికి ఓ ఎస్ టి గా బాధితులు చేపట్టే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులనుజారీ చేసింది.