seemavartha.com
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 10:15 am Digital Edition : SEEMA VARTHA DESK

పగడాల శంకరప్పకు… తెలుగు తమ్ముళ్లు, బలిజ సంఘ నేతల నివాళులు.

పగడాల శంకరప్ప కు… తెలుగు తమ్ముళ్ల అశ్రునివాళ్లు.

…. శ్రద్ధాంజలి ఘటించిన… బలిజ సంఘం నేతలు.

…. పార్థివ దేహాన్ని సందర్శించిన… హస్తకళల స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్.

గోరంట్ల సీమ వార్త అప్డేట్..

బలిజ సామాజిక వర్గ తెలుగుదేశం పార్టీ నేత కమ్మల వాండ్లపల్లి గ్రామానికి చెందిన పగడాల శంకరప్ప అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడు శంకరప్పకు మంజులమ్మ ఇంటర్ చదువుతున్న తేజస్సుని, పదవ తరగతి పూర్తి చేసుకున్న మనోజ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు బలిజ సంఘ నాయకులు శంకరప్ప పార్థివ దేహాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ హస్త కళల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్ కమ్మలవాండ్లపల్లి చేరుకొని శంకరప్ప మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకరప్ప కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ముఖ్యంగా మంత్రి సవితమ్మ ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ శంకరప్ప ఇద్దరు పిల్లలను మంత్రి స్వంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చినట్లు సోమశేఖర్ ఆ కుటుంబానికి తెలియజేశారు. భవిష్యత్తులో అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుందని ఆయన వారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిరుపాల్, సింగిల్ విండో అధ్యక్షులు రవి మోహన్, మాజీ సర్పంచ్ ఉత్తమ రెడ్డి, బాలకృష్ణ, మాజీ ఎంపీటీసీ నాగభూషణ, రెడ్డి చెరువు కట్ట మోహన్ నాతోపాటు మండల బలిజ సంఘం నాయకులు గాజుల వాండ్ల పల్లి వేణుగోపాల్, సాగునీటి సంఘం అధ్యక్షులు గాజుల వేణుగోపాల్ , సోమందేపల్లి బలిజ సంఘం అధ్యక్షులు అశ్వర్థ నారాయణ, నాగమణి, చుండూరు బాలాజీ, చుండూరు నరేంద్ర రాయల్, చిన్న రాయల్, పసుపులేటి శ్రీనివాసులు, మల్లికార్జున, గుంటి పల్లి ఈశ్వరయ్య, ప్రభాకర్, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.