తెలుగు తమ్మున్ని కుటుంబానికి.. పాలసముద్రం తెలుగు తమ్ముళ్లు ఆర్థిక సాయం.
గోరంట్ల మార్చి 16 సీమ వార్త
గోరంట్ల మండలం పాలసముద్రం పంచాయితీ పాలసముద్రం క్రాస్ లో నివాసం వుంటున్న వడ్డే వెంకట్రామప్ప నిరుపేద కుటుంబం ఇటీవల అతను అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ మరియు హిందూపూరం పార్లమెంటు సభ్యులు బి. కె.పార్థసారథి ఆదేశాలతో రూ 10 వేలు వెంకట్రమప్ప భార్యకు ఆర్థిక సాయం అందజేసి తమ మానవత్వం చాటుకున్నారు.ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాల్మీకి బోయ సాధికారత సమితి స్టేట్ మెంబర్ బెల్లాల చెరువు చంద్ర, క్లస్టర్ ఇన్చార్జి మనోహర్,పంచాయితీ కన్వీనర్ జయచంద్ర రెడ్డి, కె .సుబాన్ తెలుగు దేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు మూర్తి, గంగాధర్ (డీలర్) ఇర్షాద్ (డీలర్), కాటేపల్లి అంజి,నాగరాజు,తిప్పన్న,గంగరాజు,గిరి,కిషోర్ తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తులో మీ కుటుంబానికి ప్రభుత్వం తరుపున సహాయం అందిస్తాం అండగా ఉంటామని హామీ ఇచ్చాము.