బియ్యం తూకం తగ్గిందో… డీలర్లకు వేటు తప్పదు.
…. రేషన్ షాపు డీలర్లను హెచ్చరించిన డిప్యూటీ తాసిల్దార్.
గోరంట్ల ఏప్రిల్ 19 సీమ వార్త
ప్రభుత్వం పేద ప్రజలకు సబ్సిడీ రూపంలో అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లు తూకం తక్కువ చేసి ఇస్తే కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ శ్రీధర్ డీలర్లను హెచ్చరించారు.ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించిన మండల స్థాయి డీలర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్ షాపులో ప్రతి కార్డుదారులకు ఖచ్చితమైన తూకాలతో బియ్యం పంపిణీ చేయాలని తెలియజేశారు. అలాగే డీలర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల డీలర్లు, అధికారులు పాల్గొన్నారు.