పాలసముద్రం చెరువులో అక్రమంగా మట్టి తరలింపు.
….. రవాణాను అడ్డుకున్న… సాగునీటి సంఘం అధ్యక్షులు హరి, ఇరిగేషన్ డిఈ లక్ష్మీనారాయణ.
గోరంట్ల మార్చి 17 సీమ వార్త
గోరంట్ల మండలంలోని పాలసముద్రం చెరువులో కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా యంత్రాల సాయంతో అక్రమంగా భారీ ఎత్తున మట్టి పూనుకున్నారు. సమాచారం తెలుసుకున్న చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మనోహర్ లు ఇరిగేషన్ శాఖ డి ఈ లక్ష్మీనారాయణకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఆయన మట్టి రవణకు అనుమతులు లేవని నిర్ధారించారు. అయితే మట్టి రవాణా దారులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ పేరు చెప్పి అక్రమ మట్టి రవాణా కు పాల్పడినట్లు సమాచారం.