Saturday, March 15, 2025
Homeసీమా వార్తసీమ వార్త అప్డేట్.. గోరంట్లలో కుట్టు మిషన్ల శిక్షణ పై అవేర్నెస్ మీటింగ్

సీమ వార్త అప్డేట్.. గోరంట్లలో కుట్టు మిషన్ల శిక్షణ పై అవేర్నెస్ మీటింగ్

సీమ వార్త అప్డేట్…

గోరంట్ల లో మహిళల స్వయం ఉపాధి కోసం…… కుట్టుమిషన్ల పై లీడర్స్ కు అవగాహన

మహిళల స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మ చొరవతో మహిళల స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్ల ద్వారా శిక్షణ కార్యక్రమాల చేపడుతున్నట్లు గోరంట్ల మండల టిడిపి కన్వీనర్ సోమశేఖర్ తెలిపారు.గోరంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల నాయకులు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కుట్టు మిషన్ల శిక్షణ పై అవగాహన కల్పించారు. గోరంట్ల మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ సోమశేఖర్ తో పాటు బాలకృష్ణ చౌదరి, నిమ్మల శ్రీధర్, పచ్చ అశోక్, నాగే నాయక్, మాజీ జెడ్పిటిసి గోపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు రామచంద్ర, నాగరాజు, బిజెపి మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ నియోజకవర్గ కన్వీనర్ బొట్టు శ్రీనివాసులు, జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ జిల్లా కార్యదర్శి సురేష్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ కుట్టుమిషన్ల శిక్షణ కోసం గోరంట్ల మండలంలో ఐదు సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని అందులో గోరంట్ల 4,వానవోలు లో 1 మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని ఒక్కో సెంటర్లో 20 మిషన్ల ద్వారా 60 మందికి శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినిగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అజంతుల్లా, గిరిధర్ గౌడ్, వృక్షభ, చాందు బాషా జయరామ్, కిషోర్ రాయల్, రుద్ర ప్రకాష్, సాగునీటి సంఘం అధ్యక్షులు వేణుగోపాల్, డీలర్ శేఖర్, పసుపులటి శ్రీనివాసులు, సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు, డీలర్ రమేష్, రాఘవ నాయుడు, బిజెపి పూల గంగాధర్, శంకర, మ రెడ్డి పల్లి నరసింహులు,కసిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి, గుంటుపల్లి చంద్ర, గట్టు చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీ నరసప్ప, బంగారు బాబు, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments