గోరంట్ల లో స్వచ్చా ఆంధ్ర స్వచ్చా దివాస్
…. ఎంపీడీఓ ఆధ్వర్యంలో బస్టాండ్ లో మానవహారం, మొక్కలు నాటే కార్యక్రమం.
స్వచ్చా ఆంధ్ర స్వచ్చా దివాస్ కార్యక్రమాల్లో భాగంగా గోరంట్ల పట్టణంలోని బస్టాండ్ వద్ద మండల ఎంపీడీవో నరేంద్ర కుమార్, మేజర్ పంచాయితీ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన కూటమి నాయకులు బాలకృష్ణ చౌదరి, జనసేన మండల అధ్యక్షుడు సంతోష్, సురేష్, పంచాయతీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సంజయ్, మండల విద్యాశాఖ అధికారి గోపాల్ తదితరుల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.