….. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ మెంబర్ దేవరకొండ ఉమా శంకర్ డిమాండ్.
గోరంట్ల మార్చి 16 సీమ వార్త
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17 వ తేదీ నుండి ప్రారంభమయ్యే 2024- 2025 విద్య సంవత్సరము లో 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు కు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎస్ టి ఎస్ సి విజిలెన్స్ మాంటింగ్ కమిటీ మెంబర దేవరకొండ ఉమా శంకర్ విజ్ఞప్తి చేశారు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో ఎండల దృష్టిలో ఉంచుకుని త్రాగు నీరు సౌకర్యం కనిపించాలి మరియు బెంచెస్ సౌకర్యం కల్పించాలి. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జురాక్స్ సెంటర్ల ను ముసివేయాలి. అదేవిధంగా ఆర్టీసీ బస్సులను గ్రామాల నుండి సకాలంలో పరీక్ష సమయానికి నడపాలి. మాస్ కాపింగ్ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి సందర్భంగా డిమాండ్ చేశారు.అలాగే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మంచి మార్కులు సాధించి ఉపాధ్యాయులకు , తల్లిదండ్రులకు, మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు.