seemavartha.com
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 3:24 am Digital Edition : SEEMA VARTHA DESK

స్టేట్ బోర్డర్లో…జనసేనకు లక్కీ ఛాన్స్.

… గోరంట్ల మండల జనసేన ZPTC అభ్యర్థి వడ్డెర్లకు కేటాయింపు..??

….. అర్ధరాత్రిలో మారిన సమీకరణాలు… గోరంట్ల మండల జడ్పిటిసి జనసేనకేనని అధిష్టానం ఆదేశాలు.

….. గోరంట్ల మండల జనసేన జడ్పిటిసి అభ్యర్థిగా ఇదివరకే జనసేన నేత అనిల్ యాదవ్ భార్య సునేత్ర ఆన్లైన్ నామినేషన్ దరఖాస్తు.

… గోరంట్ల మండల టిడిపి నాయకులతో మంత్రి కార్యాలయంలో మంత్రి సుదీర్ఘ చర్చలు.. జనసేన కేనని నిర్ధారణ .

సీమ వార్త అప్డేట్…

గోరంట్ల మండల జడ్పిటిసి కూటమి అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామాలు నెలకొంటున్నాయి.గురువారం మంత్రి కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ లోని వడ్డే సామాజిక వర్గానికి చెందిన రవి మోహన్ భార్యకు గోరంట్ల జడ్పిటిసి అభ్యర్థిగా ఖరారు అయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించడం ఆపై రవి మోహన్ భార్య సుజాత పేరిట నామినేషన్ వేయడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి అధిష్టానం నుంచి గోరంట్ల మండల జడ్పిటిసి జనసేన కేటాయించాలని ఆదేశాలు రావడంతో ఒక్కసారిగా అభ్యర్థి ఎంపిక మరో మలుపు తిరిగింది. గోరంట్ల మండలంలో ఐదు ఎంపీటీసీలకు నామినేషన్లు వేసేందుకు జనసేన పార్టీ నాయకులు ముందుకు వచ్చి గురువారం మూడు చోట్ల ముగ్గురు ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన సందర్భం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా జనసేన పార్టీకి జడ్పిటిసి అవకాశం రావడంతో ఇటువైపు జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహం రావడం మరోవైపు నిర్ధారణ అయిన టికెట్టు క్యాన్సల్ కావడంపై ఇటు అభ్యర్థి అటు పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం చోటుచేసుకుంది.

పోటీలో జనసేన అభ్యర్థులు వీళ్లే…

గోరంట్ల మండలం నుంచి జనసేన పార్టీ తరఫున జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసేందుకు బూదిలి పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పెనుగొండ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్త గొల్ల అనిల్ యాదవ్ భార్య సునేత్ర ఇదివరకే ఆన్లైన్ ద్వారా జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసుకుంది. దీంతో పోటీకి మేము రెడీగా ఉన్నామని మరో చెట్టు శుక్రవారం నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మరోవైపు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఖరారు చేసిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి జనసేన తరఫున జడ్పిటిసి టికెట్ ఇస్తే సమయం జరుగుతుందని భావించిన మంత్రి కార్యాలయం వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గోరంట్ల మండలంలోని గౌని వారి పల్లి పంచాయతీ పరిధిలోని కమ్మల వాండ్ల పల్లి గ్రామానికి చెందిన వడ్డే నరేష్ భార్య విద్యావంతురాలు హరీష ను జనసేన పార్టీ నాయకులు బరిలో దింపేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం.
టిడిపి అభ్యర్థిగా భావించిన సుజాత సైతం గౌనివారిపల్లి పంచాయతీ నే కావడం అదే పంచాయతీ కమ్మలవాండ్లపల్లి గ్రామానికి చెందిన జనసేన అభ్యర్థిని ఖరారు చేసేందుకు దాదాపుగా చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే యాదవ సామాజిక వర్గం మరియు వడ్డెర సామాజిక వర్గానికి ఏదో ఒకరికి ఈ గోరంట్ల మండల జడ్పిటిసి స్థానం లభించే అవకాశాలు దాదాపుగా ఖరారు అయ్యాయి.