బ్రేకింగ్ న్యూస్.. గోరంట్లలో……కుల వృత్తి పని ముట్లు పంపిణి
గోరంట్ల మార్చి 28 సీమ వార్త
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రవేశపెట్టిన విశ్వకర్మ యువజన పథకం ద్వారా 18 కుల కుల వృత్తి ల వారికి చేయూతనివ్వడానికి వారు ఆర్థికంగా బలపడడానికి దోవదపడుతున్న పథకం విశ్వకర్మ యోజన వారికి పనిముట్లు మరియు ఆర్థిక చేయూత నివ్వడానికి బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గోరంట్ల మోహన్ శేఖర్ నాయకత్వంలో గోరంట్ల మండలంలోని మేదర కులస్తులకు చేతి వృత్తి ద్వారా పనిచేస్తున్న లబ్ధిదారులు మేదర వెంకటలక్ష్మి కి కేంద్ర ప్రభుత్వం పనిముట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల బిజెపి అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ, బిజెపి సీనియర్ నాయకులు మేదర శ్రీనివాసులు, శంకర్ రెడ్డి, బజంత్రీ శంకర, వెంకటాచలం, బాలకృష్ణ, కాచర్ల హరీష్, షబ్బీర్, లక్ష్మీనరసు, మరియు తదితరులు పాల్గొన్నారు