సవితమ్మ రహదారిలో… సర్వ జనానికి సుఖ ప్రయాణం.
…. గోతుల ప్రభుత్వ గోడు పోయి… జనానికి కూటమి ప్రభుత్వంతో ఆనందం.
….. నూతనంగా చేసిన గోరంట్ల నుంచి హిందూపురం కదిరి రోడ్లు ను అభివృద్ధికి ఆనవాళ్ళగా చూస్తున్ననేతలు
గోరంట్ల మార్చి 09 సిమ వార్త
గత ప్రభుత్వ హయంలో రాష్ట్ర రహదారులతోపాటు గ్రామీణ ప్రాంత రోడ్లు గోతుల మయమై ప్రజలకు ప్రయాణం నరకేతనగా మారి ఉండేదని రాష్ట్రంలో కూటమి ప్రభావితం వచ్చాక గుంతల రోడ్డుకు చెక్కు పెడుతూ కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి నాణ్యమైన తారు రోడ్లు వేయడం జరుగుతుందని ఇందుకు నిదర్శనమే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చొరవతో గోరంట్ల నుంచి హిందూపురం వైపు మరియు గోరంట్ల నుంచి కదిరి వైపు ఉన్న జాతీయ రహదారికి నూతనంగా తారు వేసి రోడ్ల ను సుందరీకరించడం జరిగిందని గోరంట్ల మండల కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆదివారం మండల కన్వీనర్ సోమశేఖర్, పట్టణ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు బాలకృష్ణ చౌదరి, పులేరు నరేష్, నాగే నాయక్,నిడిమామిడప్ప, ఉమర్ ఖాన్, పసుపులేటి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ రవి నాయక్, పచ్చ అశోక్, నిమ్మల శ్రీధర్, గిరిధర్ గౌడ్, అజం తుల్లా, బిజెపి మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ బొట్టు శ్రీనివాసులు, జనసేన జిల్లా కార్యదర్శి సురేష్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా వేసిన రోడ్లను కూటమి నాయకుల పరిశీలిస్తూ అభివృద్ధికి నిదర్శనం కూటమి ప్రభుత్వమని ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి సమపాళ్లలో వేగవంతంగా జరుగుతున్నాయని స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సవితమ్మ ప్రత్యేక చొరవదు నియోజకవర్గఓ లో అన్ని మండలాలు ఆదర్శవంతంగా అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురువ మహేంద్ర, మరెడ్డిపల్లి నరసింహులు, మేకల జయరాం, కమ్మవారిపల్లి వెంకటేష్, బొబ్బిలి రాము,రెడ్డప్ప, వాల్మీకి సోమశేఖర్, మల్లాపల్లి పేయ్యాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.