గోరంట్ల లో…..జనసేన డజన్ (12)వ ధమాకా సంభరాలు
…. జనసేన పార్టీ మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు.
…. హాజరైన జిల్లా కార్యదర్శి సురేష్.
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గోరంట్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా కార్యదర్శి సురేష్, నియోజకవర్గ నాయకులు గొల్ల అనిల్ కుమార్ యాదవ్, వీర మహిళ కావేరి, గుంటిపల్లి నాగేష్ తదితరుల నేతృతంలో పార్టీ ఆవిర్భావ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గోరంట్ల పట్టణ బస్టాండ్ వద్ద నుంచి ప్రధాన వీధుల్లో ద్విచక్ర వాహనాలకు పార్టీ జెండాలు కట్టుకొని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి జనసేన జిందాబాద్ పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో జన సైన్యం మార్మోగించారు. అనంతరం బస్టాండ్ వద్ద జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన కేకను కట్ చేసి పలువురుకు పంచి పెడుతూ డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలులతో సంబరాలు నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే మాకు ఒక పండుగ రోజు అని పార్టీ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం రాజీలేని పోరాటం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం జనసేన ఆవిర్భవించిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో కమ్మవారిపల్లి రాఘవ, నాగేంద్ర, రామాంజి, రమేష్, శ్రీనివాసులు, కమ్మలవాండ్ల డ్లపల్లి నరేష్, బాబా, గంగరాజు, మహేష్, మంజు నాథ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.