కరావులపల్లి తండా శివ అంజన్ దేవాలయం వద్ద జరిగే……ఎడ్లబండ్ల పోటీలకు భారీగా తరలిరండి
……జడ్పిటిసి పాలే జయరాం నాయక్ పిలుపు… ఆలయ చైర్మన్ శంకర్ లాల్ నాయక్ ఆధ్వర్యంలో వేడుకలు
గోరంట్ల ఏప్రిల్ 04 సీమ వార్త
శ్రీరామనవమిని పురస్కరించుకునితేదీ 06 -4- 2025 ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి నాలుగు గంటల వరకు గోరంట్ల మండలంలోని కరావులపల్లి తండా వద్ద ఉన్న శివంజన్ దేవాలయం వార్షికోత్సవ ఉత్సవములు మరియు ఎడ్లబండ్ల పోటీలు డాక్టర్ సునీత శంకర్ లాల్ నాయక్ మరియు కరావులపల్లి తండా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఎడ్లబండ్ల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేస్తారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని రైతులు గోరంట్ల మండల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై శివ అంజన్ దేవాలయ వార్షికోత్సవ మరియు ఎడ్ల బండ్ల పోటీలను విజయవంతం చేయాలని గోరంట్ల మండల జడ్పిటిసి పాలే జయరాం నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు