…. వారం లోపు పనులు ప్రారంభానికి….మంత్రి సమక్షంలో అధికారులు, మేజర్ పంచాయతీ సర్పంచ్ నిర్ణయం.
గోరంట్ల ఏప్రిల్ 4 సీమ వార్త
మేజర్ పంచాయతీ పరిధిలోని గోరంట్ల పట్టణంలోని కూరగాయల మార్కెట్ బైపాస్ రోడ్డు విస్తరణ కై మంత్రి సవితమ్మ సమక్షంలో
స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్
సరోజ నాగే నాయక్, ఆర్ అండ్ బి అధికారులతో చర్చించడం జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ పనుల కు సంబంధించి పెనుగొండ పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు విస్తరణ పై నిర్ణయం తీసుకోవడం జరిగిందని వచ్చే వారం లోపు పనులు మంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేయబోతున్నట్లు సర్పంచ్ సరోజ నాగే నాయక్ తెలిపారు.ప్రధానంగా బైపాస్ రోడ్డు లోని డివైడర్లకు ఒకవైపున ఏడున్నర మీటరు చొప్పున రోడ్డు వెడల్పు తో పాటు డ్రైనేజీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.