సీమ వార్త బ్రేకింగ్ న్యూస్
… గోరంట్ల మండల టిడిపి కన్వీనర్ గా బాలకృష్ణ చౌదరి ఎంపిక
….. కల నెరవేర్చుకున్న బాలకృష్ణ చౌదరి… నాయకుల ఏకాభిప్రాయం మేరకే గోరంట్ల మండల కన్వీనర్ గా ఎంపిక
గోరంట్ల మండలం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వానవోలు పంచాయితీ బాచన్న పల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ చౌదరి ని గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
పెనుగొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన గోరంట్ల మండల కన్వీనర్ పదవి ఎన్నిక ప్రత్యేక సమావేశంలో ఈ ఎంపిక జరిగినట్లు తెలిపారు. గతంలో రెండు పర్యాయాలు మండల కన్వీనర్ పదవి బాలకృష్ణ చౌదరి ఆశించినప్పటికీ అప్పటి కొన్ని సమీకరణాలవల్ల కన్వీనర్ పదవి బాలక్రిష్ణ చౌదరికి అవకాశం దక్కలేదు. అయితే ప్రస్తుత టిడిపి మండల కన్వీనర్ నూతన కమిటీల ఎంపిక లో భాగంగా మంత్రి సవితమ్మ సమక్షంలో గోరంట్ల మండల నాయకుల సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో బాలకృష్ణ చౌదరికి మండల కన్వీనర్ గా అవకాశం రావడంతో ఆయన చిరకాల వాంఛ నెరవేరిందని పార్టీ కోసం మరింత శ్రద్ధగా పని చేస్తాడని పలువురవి అభిప్రాయపడ్డారు.
నూతనంగా మండల కన్వీనర్ గా ఎంపికైన బాలకృష్ణ చౌదరి కి మండల టిడిపి నాయకులు పులేరు నరేష్, ఉత్తమ రెడ్డి, మాజీ సర్పంచ్ నీడి మామిడప్ప, నిమ్మల శ్రీధర్, గిరిధర్ గౌడ్, అజంతుల్లా, పచ్చ అశోక్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా టిడిపి మండల కన్వీనర్ గా ఎంపికైన బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో క్షేత్రస్థాయి నుంచి టిడిపి బలోపేతానికి మరింతగా కృషి చేస్తానని , గ్రామస్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి లీడర్ల వరకు అందరితోను సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సైతం సహకరించాలని ఆయన కోరారు.