…..నిర్మల సీతారామన్ సహకారం మరువలేనిది…. కరువు ప్రాంతం లో నాసన్ ఏర్పాటు… గర్వకారణం.
…… గోరంట్ల మండలం పాలసముద్రం ప్రాంతం…. కేంద్ర సహకారంతో మరింత అభివృద్ధి.
….ఢిల్లీ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి అభినందించిన…. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి.
పుట్టపర్తి డెస్క్ మే 30 సీమ వార్త
సత్యసాయి జిల్లా పాలసముద్రం నాసిన్ కేంద్రం ఏర్పాటు, విస్తరణకు కృషి చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి.
భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక శిక్షణా సంస్థలలో ఒకటైన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా, పాలసముద్రం వంటి వెనుకబడి ప్రాంతంలో స్థాపించడం ఎంతో గర్వకారణమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 729 కోట్ల మేర నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శిక్షణా కేంద్రాల్లో అతిపెద్దదిగా నిలిచిందని అన్నారు. మొదటిసారిగా ప్రపంచ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థగా దీనికి గుర్తింపు లభించడం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.ఈ గొప్ప అవకాశం కోసం నిరంతరం కృషి చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ని ఆయన న్యూఢిల్లీలోని ఆమె కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, తన అభినందనలు మరియు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెనుక బడిన ప్రాంతాల్లో ఇటువంటి ప్రఖ్యాత శిక్షణా సంస్థలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, మరియు ఆర్ధికాభివృద్ధి కలుగుతుంది. ఇలాంటి దూరదృష్టితో పనిచేస్తున్న నిర్మలా సీతారామన్ కి నా కృతజ్ఞతలు. అలాగే త్వరలో ఈ సంస్థ పర్యటనకు రావాలని మంత్రి గారిని కోరినట్టు తెలిపారు. దీనికి మంత్రి గారు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.ఈ ప్రాంతంలో విద్యార్థుల కోసం ఓక కేంద్రీయ విద్యా సంస్థ మంజూరు చేయడం, అలాగే ఈ ప్రాంతంలో ఇతర ప్రాజెక్టులకు అత్యధికంగా నిధులు కేటాయించడం రాయలసీమ పట్ల ఆర్థిక మంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తుంది అని పేర్కొన్నారు.