సీమ వార్త అప్డేట్..
….. గోరంట్ల మండలానికి…. మండల పరిషత్ కు రూ, 88 లక్షలు నిధులు మంజూరు.
….. జనం ఓట్లు వేసి గెలిపించిన……ప్రజాప్రతినిధులను అవమాన పరచకండి.
…. గోరంట్ల ఎంపీడీవోను ప్రశ్నించిన… మాజీమంత్రి ఉషశ్రీ చరణ్.
గోరంట్ల మే 30 సీమ వార్త
గోరంట్ల మండల పరిషత్ లో 22 మంది సభ్యులు ఉండగా అందులో ప్రస్తుతం 21 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలే ఉన్నారని, ఎంపీపీ మరియు ఇద్దరు వైస్ ఎంపీపీ సైతం వైసీపీ వాళ్లేనని అలాంటి తరుణంలో మండల పరిషత్ కింద మంజూయ్యే నిధులు మా సభ్యులకు ఎందుకు ఇవ్వరు అని మాజీ మంత్రి, స్థానిక నియోజకవర్గ ఇన్చార్జ్, వాటి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గోరంట్ల ఎంపీడీవోను డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయానికి ఆమెతోపాటు ఎంపీపీ ప్రమీల మూర్తి,మండల కన్వీనర్ వెంకటేష్ పట్టణ కన్వీనర్, జిల్లా అధికార ప్రతినిధి మేదర శంకర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నార్సింపల్లి రఘురామిరెడ్డి, బాలన్న గారి పల్లి పోతుల రామకృష్ణారెడ్డి, bఎంపీటీసీలు ఓబుల్ రెడ్డి, సోమశేఖర్, ఉప సర్పంచ్ రాజారెడ్డి, కురుబ సత్యనారాయణ, జొన్న ఆంజనేయులు, సర్పంచ్ శివానంద, హేమ సుందర్ రెడ్డి, గంగంపల్లి వెంకట రంగారెడ్డి, రాజేంద్రప్రసాద్, రాణా ప్రతాప్ సింగ్, నీలే రంగారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఎంపీడీవో ఆఫీస్ చేరుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో నరేంద్ర కుమార్ తో ఆయన చాంబర్లో మాట్లాడుతూ గోరంట్ల మండల అభివృద్ధి కోసం మండల పరిషత్ కు 88 లక్షల దాకా నిధులు మంజూరు అయ్యాయని వాటిని ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీటీసీలకు సమానంగా ఇవ్వాలని అలా కాకుండా మంజూరైన నిధులు అధికార పార్టీ వారికి ఏకపక్షంగా పంపిణీ చేస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అవమానపరిచినట్లు అవుతుందని అది కరెక్ట్ కాదని ఆమె సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎంపీటీసీలకు మంజూరైన నిధులు కేటాయించినప్పటికీ అవి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుంది తప్ప ఎక్కడ నిధుల దుర్వినియోగం జరగదని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బాచన్న పల్లి నారప్ప, వానవోలు రాఘవ, సర్పంచ్ వాసు నాయక్, భక్తర్,మునాఫ్, తదితరులు పాల్గొన్నారు.