*RTC బస్టాండులో … ఉపాధి ఉద్యోగి మృతి.
సీమ వార్త గోరంట్ల అప్డేట్ న్యూస్..
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలో ఎన్ ఆర్ జి ఎస్ ఉపాధి హామీ EC గా విధులు నిర్వహిస్తున్న గంగాధరని ఉద్యోగి గోరంట్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
మృతుడు గంగాధర్ ఇటీవల సోమందేపల్లి మండలం నుంచి గోరంట్లకు బదిలీ వచ్చి
పట్టణంలోని వినాయక నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటికి వెళ్లి వస్తానని వచ్చాడని అయితే శుక్రవారం ఉదయం బస్టాండ్ వద్ద శవమై కనిపించాడని భార్య ఆదెమ్మ తెలిపారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఆమె అన్నారు. సంఘటన స్థలాన్ని స్థానిక సీఐ శేఖర్ పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. మరణానికి సంబంధించి వాస్త విషయాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
