రాయల్ అధినేత నరసింహ రావు కు గోరంట్ల రాయల్స్ సన్మానం
సీమ వార్త అప్డేట్….
బలిజ సంఘం రాష్ట్ర నేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పెనుగొండ నియోజకవర్గం అబ్జర్వర్ నరసింహరావు రాయల్ కు గోరంట్ల మండల బలిజ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.నియోజకవర్గ పర్యటనకు పాటు మంత్రి సవితమ్మ కార్యక్రమాలకు నరసింహారావు హాజరు నేపథ్యంలో గురువారం గోరంట్ల మండల బలిజల ఆహ్వానం మేరకు గోరంట్ల పట్టణంలోని సోమశేఖర్ నివాసంలో ఆయనను ఘనంగా
సన్మానించారు.గోరంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ సోమశేఖర్ నివాసంలో జరిగిన బలిజల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ అబ్జర్వర్ నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరై తేనేటి విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బలిజలు శాసించే స్థాయిలో ఉన్నప్పటికీ వర్తించే పరిస్థితుల్లోనే ఉన్నామని రాజకీయంగా పదవులు సాధిస్తేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని, సంఘాన్ని బలోపేతం చేసుకుంటామని అందుకు మీ తోడ్పాటు కావాలని మండల బల్లి సంఘం నాయకులు ఆయన్ను కోరారు.ఈ కార్యక్రమంలో సోమశేఖర్, గంగాధర్, గాజుల వేణుగోపాల్, లక్ష్మి నారాయణ, ప్రిన్సిపల్ సూర్యనారాయణ,డాక్టర్ రవితేజ, డాక్టర్ రామయ్య, నరేంద్ర రాయల్, కమలాకర్, జయప్రకాష్, సర్పంచ్ నరసింహమూర్తి, ప్రిన్సిపల్ భక్తవత్సలం, చిన్న రాయుల్, చలపతి, సాగునీటి సంఘం అధ్యక్షులు వేణుగోపాల్, పసుపులేటి శ్రీనివాసులు, గుంటి పల్లి ఈశ్వరయ్య, ఎస్వి నారాయణ, గుంటి పల్లి నాగేష్, తదితరులు పాల్గొన్నారు.
