*నారా లోకేష్ ను కలిసిన.. గోరంట్ల అశ్వర్త్ రెడ్డి.
సీమ వార్త అప్డేట్…
గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మలసముద్రం సర్పంచ్ సువర్ణ అశ్వర్త్ రెడ్డి రాష్ట్రమంత్రి నారా లోకేష్ ను పుట్టపర్తిలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయాలతో పాటు ప్రస్తుతం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు గ్రామస్థాయిలో ఇంటింటికి తీసుకెళుతున్నామని ప్రజలు రాష్ట్ర పాలనపై సంతృప్తిగా ఉన్నారని అశ్వర్త్ రెడ్డి నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.