ప్లాస్టిక్ నివారణ పై… గోరంట్ల EO స్పెషల్ డ్రైవ్
సీమ వార్త అప్డేట్
ప్లాస్టిక్ నివారణ కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు గోరంట్ల మేజర్ పంచాయతీ ఈవో సుబ్రమణ్యం శనివారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడుతున్న పలు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో కలిసి శనివారం ఉదయమే పట్టణంలోని పలు పాల డైరీలలో విక్రయిస్తున్న కవర్లను పరిశీలిస్తూ ఇప్పటికే నోటీసులు ఇచ్చామని అయినప్పటికీ కొందరిలో మార్పు రాలేదని ఇప్పటికైనా ప్రమాదకరమైన ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని లేనిపక్షంలో జరిమానాలు ఉంటాయని వ్యాపార లైసెన్సుల సైతం రద్దు చేస్తామని ఆయన సుతి మెత్తగా వ్యాపారులకు హెచ్చరించారు.
ప్లాస్టిక్ నివారణ పై గోరంట్ల మైదుకూరు పంచాయతీ పాలకులు మరియు మండల అధికారులు చూపిస్తున్న చొరవ అభినందనీయమని ప్రజలు మరియు వ్యాపారస్తుల సైతం సహకరించాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు.
