… మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో… రామచంద్రారెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్.
…. నిమ్మల శ్రీధర్ నేతృతంలో నియోజకవర్గస్థాయి టోర్నమెంట్ కు శ్రీకారం.
గోరంట్ల సెప్టెంబర్ 21 సీమ వార్త
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తండ్రి దివంగత నేత మాజీ మంత్రి రామచంద్రారెడ్డి పేరిట గోరంట్ల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిమ్మల శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం గుమ్మయ్యగారపల్లి సమీపంలోని సూర్యదేవర స్కూల్ గ్రౌండ్ లో ఈ పోటీలు నిర్వహిస్తున్నమని అందుకు సంబంధించిన క్రీడ మైదానాన్ని మండల టిడిపి కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పెనుగొండ నియోజకవర్గం లోని క్రికెట్ జట్లు ఈ టోర్నమెంట్లో వెయ్యి రూపాయల కోసం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సుబహన్ 8431319686, రోహిత్ 8179848599, ప్రకాష్ నాయుడు 8374091064 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ బొట్టు శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవీంద్రనాయక్, కురుబ మల్లికార్జున, కురుబ మహేంద్ర, మామిడికాయల హరి, కాసిం, సుబహన్, గౌని వారి పల్లి రోహిత్, డీలర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.