గోరంట్ల లో… దేవాంగం “శీనా కే మార్కెట్”.
… ఎన్నిక కు సహకరించిన మంత్రి సవితమ్మ, మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, నిమ్మల శ్రీధర్, పార్టీ క్యాడర్ కు రుణపడి ఉంటా
… సింగిరెడ్డిపల్లి దేవాంగం శ్రీనివాసులు.
సీమ వార్త అప్డేట్ న్యూస్…
గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ల నియామకంలో పార్టీకి నిరంతరం కష్టపడ్డ క్యాడర్ కు ప్రాధాన్యతనిస్తూ మంత్రి సవితమ్మ గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ నేత దేవాంగం శ్రీనివాసులు కు గోరంట్ల మార్కెట్ డైరెక్టర్ గా నియమించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఇందులో భాగంగా బుధవారం రాత్రి అధిష్టానం నుంచి వెలువడిన జాబితాలో దేవాంగం శ్రీనివాసులు కు చోటు దక్కింది.ఈ నేపథంలో నూతనంగా గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా నియమితులైన దేవాంగం శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో పనిచేసిన దానికి గుర్తింపు గా మంత్రి సవితమ్మ మరియు మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, టిడిపి సీనియర్ నాయకులు నిమ్మల శ్రీధర్ తో పాటు పార్టీ క్యాడర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో దేవాంగం శ్రీనివాసులు టీఎన్ఎస్ఎఫ్ లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.ఒక బీసీ వర్గానికి చెందిన దేవాంగం శ్రీనివాసులకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా అవకాశం ఇవ్వడం పై బీసీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.