seemavartha.com
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 5:56 am Digital Edition : SEEMA VARTHA DESK

అజంతుల్ల స్టోర్ లో స్మార్ట్ కార్డుల పంపిణీ

స్మార్ట్ కార్డ్ … సరుకులు పంపిణీ వేగవంతం కోసమే.

…. అజంతుల్లా స్టోర్ లో స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన తాసిల్దార్,మండల కన్వీనర్.

సీమ వార్త అప్డేట్ న్యూస్

గోరంట్ల పట్టణంలోని నాలుగో వార్డు లో గల అజంతుల్లా చౌక ధాన్యపు డిపోలో శుక్రవారం మండల తాసిల్దార్ మారుతి టిడిపి మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి చేతులమీదుగా లబ్దిదారులకు స్మార్ట్ కార్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీలో వేగంతం చేయడం కోసమే స్మార్ట్ కార్డ్ ల పంపిణీ జరుగుతోందని, గోరంట్ల మండలంలో 46 చౌక ధాన్యపు డిపోలు ఉన్నాయని వాటి పరిధిలో 24, 524 మంది లబ్ధిదారులు ఉన్నారని ఆయన తెలిపారు. వారందరికీ ఈ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు నరేష్, నిమ్మల శ్రీధర్, డీలర్ అజంతుల్లా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాసులు, సింగిల్ విండో డైరెక్టర్లు నబి రసూల్, పూల గంగాధర్, వీఆర్వో అశోక్, కురుబ మహేంద్ర, అమనుల్లా, సుబ్బరాయుడు, లక్ష్మీ నరసప్ప, ఖలీమ్, నిజాం తదితరులు పాల్గొన్నారు.