అన్నదాత సుఖీభవ కోసం… రేపు గోరంట్లలో స్పెషల్ గ్రీవెన్స్.
… టిడిపి మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి వ్యవసాయ అధికారి శంకర్ నాయక్.
గోరంట్ల ఆగస్టు 6 సీమ వార్త
రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదు పడని రైతులు ఎవరైనా ఉంటే వారికోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నామని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మరియు వ్యవసాయ శాఖ అధికారి శంకర నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో గురువారం ఉదయం 11 గంటలకు ఎంపీడీవో మరియు తాసిల్దార్ మరియు అగ్రికల్చర్ అధికారి ల నేతృతంలో ఈ స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని బాధ్యత రైతులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సాంకేతిక కారణాలవల్ల అన్నదాత సుఖీభవ సాయం అందని రైతులు వారి యొక్క ఆధార్ కార్డు మరియు భూమి పాసుపుస్తకాన్ని గ్రీవెన్స్ కు తీసుకురావాలని కోరారు.