బెస్ట్ బిజినెస్ మ్యాన్ ల కు.. ప్రజుక్తి పెయింట్స్ ప్రొప్రైటర్ భాను ప్రకాష్ బెస్ట్ గిఫ్ట్స్.
సీమ వార్త బ్రేకింగ్ న్యూస్…
దసరా పండుగను పురస్కరించుకొని తమ వ్యాపారాలలో మంచి ఫలితాలు సాధించిన కాంట్రాక్టర్స్ ను గుర్తించి వారికి విలువైన బహుమతులు అందజేసి ప్రోత్సహించింది గోరంట్ల పట్టణంలోని ప్రజుక్తి పెయింట్స్ యాజమాన్యం. పట్టణంలోని ప్రజిక్తి పెయింట్స్ ప్రొప్రైటర్ భాను ప్రకాష్ తన దుకాణం ద్వారా అత్యధిక బిజినెస్ చేసి ఉత్తమ బిజినెస్ మాన్ గా నిలిచిన పలువురికి గురువారం విలువైన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని కలర్ పెయింట్స్ వ్యాపారులతో పాటు వైసిపి మండల అధ్యక్షులు వెంకటేష్, మండల వైసీపీ సీనియర్ నాయకులు రాణా ప్రతాప్ సింగ్, వైసీపీ బీసీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.