గోల్డ్ మెడలిస్ట్….. షంషీర్ కు ప్రోత్సాహక బహుమతి.
…… విద్యార్థికి 10 వేల నగదు పురస్కారం.
గోరంట్ల ఏప్రిల్ 4 సీమ వార్త
జమియత్ ఉలమా గోరంట్ల సంస్థ ఆధ్వర్యంలో జమియత్ గోరంట్ల మండల అధ్యక్షులు మౌలానా షఫీవుల్లా సాబ్ చేతుల మీదుగా గోరంట్ల పట్టణానికి చెందిన షేక్ షంషీర్ అనే విద్యార్థి, సినీ నటులు డాక్టర్ మోహన్ బాబు డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాల డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ భాగంలో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఈ విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ శాలువా తో సత్కరించి, విద్యా ప్రోత్సాహకంగా 10,000/- రూ.లు. నగదు జమియత్ ఉలమా గోరంట్ల సంస్థ ద్వారా అందించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ చదువు అనేది మన జీవితాల్లో వెలుగు నింపేది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదివి ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది మరియు ఎటువంటి మంచి పనులకైనా తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి గోరంట్ల జమియత్ ఉలమా సంస్థ ముందుంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మౌలానా షఫీవుల్లా, సభ్యులు మౌలానా అబ్దుల్లా, హాఫీస్ జావీద్, ఎజాజ్, అజ్మతుల్లా పాల్గొన్నారు