• చోరి సొమ్ము రికవరీ, లోక దళత్ కేసుల రాజీలు, జనరల్ కేసుల విచారణలో గోరంట్ల సిఐ శేఖర్ బెష్.
• జిల్లా ఎస్పీ రత్న, పెనుగొండ డిఎస్పి నరసింగప్ప సమక్షంలో బెస్ట్ సర్వీస్ అవార్డు.
గోరంట్ల , జులై 27 సీమ వార్త : శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, దొంగలు దోచుకెల్లిన సొమ్ము రికవరీ, కేసుల విచారణలు వేగవంతం ఇలా అనునిత్యం శాంతి భద్రతల నియంత్రణ కోసం తన కర్తవ్యం లో రాజీలేని విధి నిర్వహణలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారూ గోరంట్ల సీఐ బోయ శేఖర్. గోరంట్ల పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా బాధితులు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు బోయ శేఖర్ తన విధి నిర్వహణలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతూ ఒకవైపు నేరాల నియంత్రణ, నమోదు అయిన కేసుల్లో వేగవంతమైన విచారణ చేస్తూ శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పుట్టపర్తిలో జిల్లా ఎస్పీ రత్న చేతుల మీదుగా ఉత్తమ సేవల ప్రశంస పత్రాన్ని శేఖర్ అందుకున్నారు. గోరంట్ల మండల పరిధిలో ఇటీవల పలు రకాల కేసుల్లో నమోదైన చోరీ కేసుల్లో రూ, 28 లక్షలు రికవరీ మరియు స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసులు లోకాదల్ ద్వారా కేసుల రాజీ పరిష్కారం తోపాటు నమోదైన పలు రకాల జనరల్ కేసుల విచారణ వాటి వేగవంతం పై మంచి ఫలితాలు సాధించడంతో జిల్లా పోలీసు అధికారులు అభినందిస్తూ బోయ శేఖర్ కు ఉత్తమ సేవా అవార్డును అందజేసి అభినందించారు.