గోరంట్ల లో…..పేదల ఇళ్లకు పార్థుని రోడ్డు.
…..రూ 10 లక్షల ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.
…. పాల్గొన్మ… కూటమి నాయకులు… ఆనందం వ్యక్తం చేసిన పేద ప్రజలు.
సీమ వార్త అప్డేట్…
పేదల కుటుంబాలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచనతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్తీక్ యాదవ్, బోర్ వెల్ అశ్వత్ రెడ్డి, నీలకంఠారెడ్డి తదితరుల కోరిక మేరకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారథి తన సొంత నిధుల నుంచి రూ, 10 లక్షల నిధులు మంజూరు చేశారు.ఈ సందర్భంగా పట్టణంలోని నాలుగవ వార్డు పరిధిలోని పులేరు రోడ్డు గుడిసెల కాలనీ ప్రాంతంలోని నివాస ప్రాంతాలకు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ ప్రాంత ప్రజలు మొర పెట్టుకోవడంతో స్పందించిన ఎంపీ పార్థసారథి నిదులు మంజూరు చేయడం విని వెంటనే భూమి పూజ చేసి రోడ్డు పనులు సైతం ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి.ఇందులో భాగంగా గురువారం ఆ కాలనీలో భూమి పూజ కార్యక్రమాలకు ఎంపీ బీకే పార్థసారథి వర్గీయులు అశ్వత్ రెడ్డి, నీలకంఠారెడ్డి, నరేంద్ర రాయల్, కార్తీక్ యాదవ్, మరెడ్డి పల్లి నరసింహులు, మరియు బిజెపి మండలాధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ, జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ తదితరులు నేతృతంలో భూమి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు స్పందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేక ఎన్నో కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎంపీ పార్థసారథి స్పందించి స్థానిక నాయకుల చొరవతో మా ప్రాంతంలో రోడ్డు వేయడం ఆనందంగా ఉందని కృతజ్ఞత తీర్చుకుంటామని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపల్లి ఫిరోజ్, కమ్మవారి పల్లి బాలకృష్ణ, ఈశ్వరయ్య, అవినాష్ పాత పాటు బిజెపి నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ పూల గంగాధర్, శంకర, జనసేన నాయకులు వీర మహిళ వాల్మీకి కావేరి, సింగిల్ విండో డైరెక్టర్ గుంటిపల్లి నగేష్, తిరుపాల్ గాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.