…. నాడు సర్పంచ్ పాలనలో సక్సెస్ తో.. నేడు గోరంట్ల మార్కెట్ యార్డు పాలన కు ఛాన్స్.
…. మంత్రి సవితమ్మకు మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరికి నిమ్మల శ్రీధర్ తో పాటు పార్టీ క్యాడర్ కు కృతజ్ఞతలు తెలిపిన వైనం.
సీమ వార్త అప్డేట్ న్యూస్…
బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారి ఎదుగుదలకు తోడుగా ఉంటుందని జండా మోసిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి ఆ జెండా నీడే శ్రీరామరక్షగా ఉంటుంది అనే నినాదానికి సాక్షిగా మారుమూల ప్రాంత పార్టీ కేడర్ కు సైతం గౌరవప్రదమైన పదవులు అప్పజెప్పుతోందని అందుకు నిదర్శనమే గోరంట్ల మండలంలోని మారుమూల గుంటిపల్లి గిరిజన తండాకు చెందిన మాజీ సర్పంచ్ రవీంద్ర నాయక్ మంత్రి సవితమ్మ ఆశీస్సులతో గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా బుధవారం రాత్రి ఉత్తర్వులు విలువడ్డాయి. దీంతో బంజారా గిరిజన తండావాసులలో హర్షం వ్యక్తం అవుతున్నాయి. నూతన డైరెక్టర్ గా ఎంపికైన రవీంద్రనాథ్ గతంలో ఉమ్మడి వానవోలు పంచాయతీ సర్పంచ్ గా పనిచేసి అన్ని వర్గాల మన్ననలు పొందారు. ఆయన పార్టీకి నిరంతరం చేస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం మరియు మంత్రి సవితమ్మ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, మండల సీనియర్ నాయకులు నిమ్మల శ్రీధర్ తోపాటు ముఖ్య క్యాడర్ మాకు ఈ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని రాబోవు రోజుల్లో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని రవీంద్ర నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు.