ఐ జే యు సోమ సుందర్ ను సన్మానించిన… గోరంట్ల జర్నలిస్టులు.
…. చిన్న పత్రికల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సత్కారం.
గోరంట్ల సెప్టెంబర్ 03 సీమ వార్త.
గోరంట్ల పట్టణ సమీపంలోని షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ సోమ సుందర్ ను గోరంట్ల మండల జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. జిల్లా పర్యటన నిమిత్తం గోరంట్ల మండలం మీదుగా లేపాక్షి ఆలయ సందర్శన నిమిత్తం వెళుతున్న నేపథ్యంలో మార్గమధ్యంలో షిరిడి సాయి ఆలయం వద్ద రాష్ట్ర చిన్న పత్రికల ఎడిటర్స్ అసోసియేషన్ శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు బీరే ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సన్మానించారు. ఇందులో భాగంగా వార్త నియోజకవర్గ స్టాపర్ ఈశ్వరయ్య తో పాటు ఆంధ్రప్రభ రిపోర్టర్ లక్ష్మీనారాయణ, మనం రిపోర్టర్ కిష్టప్ప, ఎలక్ట్రాన్ మీడియా ఛానల్ రిపోర్టర్ శివ, జనసేన పత్రిక రిపోర్టర్ మహేష్, అనంత న్యూస్ రిపోర్టర్ శంకర, వాయిస్ ఆఫ్ విక్టర్ పత్రిక రిపోర్టర్ అంబే వెంకటేష్ తదితరులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రెటరీ సోమ సుందర్ ను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడిమర్రి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మండల అధ్యక్షులు ఓబుళపతి, బత్తలపల్లి రిపోర్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.