నేత కార్మికురాలికి నిమ్మల శ్రీధర్ అండ.
…. చేనేత దినోత్సవం నాడు ఓ అభాగ్యురాలికి… నిత్యవసర సరుకులు అందజేత.
…. మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో మానవత్వం చాటుకున్న నిమ్మల శ్రీధర్.
గోరంట్ల ఆగస్టు 7 సీమ వార్త
అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాడు అభాగ్యురాలైన నేత కార్మికురాలకి తన వంతు సాయం అందించి ఒకవైపు మానవత్వం చాటుకుంటూ మరోవైపు తమ సామాజిక వర్గ మహిళలకు తోడుగా నిలుస్తూ అందరి మన్ననలు పొందాడు తెలుగుదేశం పార్టీ మరియు నేత కార్మిక సంఘం నాయకులు నిమ్మల శ్రీధర్. అంతర్జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని గోరంట్ల పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ ప్రాంతానికి చెందిన కౌసల్య అనే చేనేత కార్మికురాలికి స్థానిక తోటి కార్మికుల అభ్యర్థన మేరకు నిమ్మల శ్రీధర్ గురువారం టిడిపి మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి చేతుల మీదుగా అభాగ్యురాలు కౌసల్యకు బియ్యం ప్యాకెట్టు, బ్యాళ్లు, చక్కెర, నూనె వంటి సరుకులు అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా దాత నిమ్మల శ్రీ ధర్ ను స్థానిక నేత నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత నేత నాయకులు వట్టి సుధాకర్, వార్డు మెంబర్ రామచంద్ర, బండ మహేష్, మునిస్వామి, అంబే సత్తి తదితరులు నిమ్మల శ్రీధర్ ను చౌడేశ్వరి కాలనీ తరఫున అభినందిస్తున్నామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కురుబ మల్లికార్జున, మాజీ సర్పంచ్ రవీంద్ర నాయక్, మామిడికాయల హరి, కురుబ మహేంద్ర, డీలర్ రోహిత్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.