Tuesday, March 3, 2026
Homeసీమా వార్తపొలిమేర లో క్షుద్ర పూజలు

పొలిమేర లో క్షుద్ర పూజలు

📰 Generate e-Paper Clip

పొలిమేర లో క్షుద్ర పూజలు

…. గుప్తనిధుల కోసం తవ్వకాలు… గుంటిపల్లి వద్ద వెలుగు చూసిన ఘటన.

గోరంట్ల సెప్టెంబర్ 07 సీమ వార్త

గోరంట్ల మండలంలోని వానవోలు పంచాయతీ పరిధిలోని గుంటిపల్లి జక్కసముద్రం గ్రామాల మధ్యన గల పొలిమేరమ్మ ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ సందర్భంగా ఆలయ సమీపంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగు చూడడంతో పాటు సమీపంలో బండరాలను పిలిచి తవ్వకాలు చేపట్టిన సంఘటన వాస్తవాలకు నిదర్శనంగా కనబడుతున్నాయి.
అయితే తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో ఆ బండరాళ్ల విలువైన గుప్త నిధులు ఏమైనా బయటపడ్డాయా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
పురాతన ఆలయాలు పవిత్ర ప్రదేశాలపై కొందరు కన్నేసి డబ్బు సంపాదన కోసం ఆనాటి జ్ఞాపకాలను, ఆనాటి పవిత్రతను ధ్వంసం చేస్తూ పలువురి మనోభావాలను దెబ్బతీస్తున్నారని అలాంటి వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular