అయ్యప్పలకు “పవిత్ర”మైన వస్త్రదానం.
… 51 మందికి రెండు జతలు చొప్పున… అయ్యప్ప దుస్తులు మాలలు పంపిణీ.
గోరంట్ల సీమ వార్త అప్డేట్…
కార్తీక మాసంలో పవిత్రమైన అయ్యప్ప దీక్ష చేయదలచిన వారికి అయ్యప్ప భక్తులు పురుషోత్తం, పవిత్ర దంపతులు వారి కుమారుడు నాగార్జున లు నూతన దీక్ష ప్రారంభించే ఆయప్పలకు నూతన వస్త్ర దానం చేసి తమ భక్తి భావాన్ని, సేవాభావాన్ని చాటుకున్నారు ఆ దంపతులు. ఈ సందర్భంగా శుక్రవారం చంద్రశేఖర్ థియేటర్ వద్ద ప్రధాన రహదారిలో గల తమ సొంత పూల దుకాణం వద్ద గురుస్వామి తిప్పన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అనంతరం అయ్యప్పలకు రెండు చేతుల బట్టలు, రెండు జతలను మాలలు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు పురుషోత్తం, పవిత్ర లు మాట్లాడుతూ కార్తీక మాసంలో దీక్షను చేపడుతున్న అయ్యప్పల కోసం తమ వంతు బాధ్యతగా వస్త్రధానానికి ముందుకొచ్చేమని అలాగే తిప్పన్న గురుస్వామి సన్నిధానంలో రోజువారీగా జరిగే అన్నదానాన కార్యక్రమాలకు రూ, 6116 లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి తిప్పన్న, డ్రైవర్ గుడిసె నాగరాజు, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
