seemavartha.com
Newspaper Banner
Date of Publish : 24 September 2025, 11:05 am Digital Edition : SEEMA VARTHA DESK

OG సినిమా టికెట్టు.. మునిస్వామి కే “ముందు” టికెట్టు.

….పవన్ “OG” సినిమా టికెట్ గోరంట్ల లో 20 వేలు వేలం

సీమ వార్త బ్రేకింగ్ న్యూస్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ (OG) సినిమా మొదటి టికెట్ వేలం పాటలో గోరంట్ల మండల కేంద్రానికి చెందిన మెగా వీరాభిమాని DJ మునిస్వామి రూ, 20 వేల కు వేలం పాటలో దక్కించుకొని పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలోని చంద్రశేఖర్ థియేటర్ కాంప్లెక్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్ ఆవరణలో బుధవారం పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకులు చిలమత్తూరి వెంకటేష్, పాగు తోట వెంకటేష్, గాజుల రమేష్, సురేష్, రామాంజనేయులు తదితరుల నేతృతంలో జరిపిన వేలంపాటలో డీజే మునిస్వామి మొదటి టికెట్ను 20 వేలకు వేలం పాటలు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా థియేటర్ నిర్వాహకులు వెంకటేష్ బాబు మొదటి టికెట్ ను అందజేయగా తోటి అభిమానులు మునిస్వామికి పూలమాలలు వేసి అభినందించారు.