కోడి కూత కే పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం మాదే
… గోరంట్ల పట్టణంలో పెంచన్ల పంపిణీ తీరును పరిశీలించిన…మాజీ మండల కన్వీనర్
గోరంట్ల సీమ వార్త అప్డేట్..
వయోవృద్ధుల కనీస అవసరాలు గుర్తించిన కుటుంబ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీ కోడికూత టైంకి వారి గుమ్మం మొదటే పింఛన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ సోమశేఖర్ అభిప్రాయపడ్డారు.సోమవారం ఉదయం గోరంట్ల పట్టణంలోని వడ్డీ వారి వీధి, బేతాళ చర్చి, చౌడేశ్వరి కాలనీ, పులేరు రోడ్డు, సొంత మార్కెట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పింఛన్లు పంపిణీ తీరును వారు పరిశీలిస్తూ పంపిణీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు సోమశేఖర్, గిరిధర్ గౌడ్, వార్డు మెంబర్ లక్ష్మి నాగరాజు తదితరులు మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ల లో గత ప్రభుత్వం అనర్హులకు కట్టబెట్టిందని వాటికోసం క్షేత్రస్థాయిలో అధికారులు నోటీసులు ఇచ్చి వెరిఫికేషన్ చేశారని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పింఛన్లు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ దేవాంగం శ్రీనివాసులు, ఉమా శంకర్, కక్కల రఘునాథ్ రెడ్డి, గిరిధర్ గౌడ్, బొబ్బిలి రాము, బూత్ కన్వీనర్ మునిస్వామి, అజంతుల్లా, జయరాం, డీలర్ మల్లేష్,ఖలీమ్, వాల్మీకి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.