…. ఎస్సై బాలాజీ నాయక్, శ్రీనివాసులు లకు ఘనంగా…..సన్మానించి వీడ్కోలు పలికిన సిఐ శేఖర్ టీం.
గోరంట్ల మార్చి 9 సీమ వార్త
గోరంట్ల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ లు గా విధులు నిర్వహిస్తున్న బాలాజీ నాయక్, శ్రీనివాసులు లు ఆదివారం బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ శేఖర్ ఆధ్వర్యంలో బదిలీ అధికారులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. గోరట్ల పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ అయినా బాలాజీ నాయక్ అన్నమయ్య జిల్లాకు, శ్రీనివాసులు నెల్లూరు జిల్లాకు బదిలీ వెళుతున్నట్లు తెలిపారు. బాలాజీ నాయక్ ఇటీవల గోరంట్ల పోలీస్స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.