గోరంట్ల ఏప్రిల్ 4 సీమ వార్త
కోరే వాండ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నందు స్కూల్ డే మరియు సరస్వతి పూజ కార్యక్రమాన్న అట్ట హాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ఆశీర్వదించి , భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నీలం అశోక్ , ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి , కిషోర్ కుమార్ , రాధా , కృష్ణ వేణి , శ్రీదేవి లు మరియు విద్యార్థులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు