seemavartha.com
Newspaper Banner
Date of Publish : 10 October 2025, 6:17 am Digital Edition : SEEMA VARTHA DESK

టిడిపి కార్యకర్త ఫ్యామిలీకి……తెలుగు తమ్ముళ్ల అభయహస్తం.

టిడిపి కార్యకర్త ఫ్యామిలీకి……తెలుగు తమ్ముళ్ల అభయహస్తం.

….మంత్రి ఆదేశాలతో రూ, 52 వేలు ఆర్థిక సాయం అందజేసిన వైనం.

…. కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో…. మృతురాలికి నివాళులు.

సీమ వార్త అప్డేట్…

గోరంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ టిడిపి కార్యకర్త షేక్ పీరా సాబ్ భార్య జరీన్ తజ్ ఆకస్మికంగా మృతి చెందింది. మంత్రి సవితమ్మ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో మండల నాయకులు తమ వంతు బాధ్యతగా సీనియర్ టిడిపి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతో పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో పట్టణంలోని రాజీవ్ కాలనీలోని పీరా నివాసం వద్దకు చేరుకొని మృతురాలు జరీన్ తజ్ కు నివాళులు అర్పించి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పార్టీ నిరంతరం మీకు అండగా ఉంటుందని నాయకులు హామీ ఇచ్చారు.అనంతరం మంత్రి ఆదేశాలతో స్థానిక నాయకుల ద్వారా సేకరించిన రూ, 52 వేల నగదును టిడిపి కార్యకర్త పీరాకు అందజేసి అభయాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, మాజీ సర్పంచ్ నరేష్, నిమ్మల శ్రీధర్, ఉత్తమ రెడ్డి, నాగే నాయక్, అజంతుల్లా, నబీ రసూల్,ఉమర్ ఖాన్, మల్లాపల్లి మహమ్మద్, కక్కల అరుగునాథ్ రెడ్డి,వెంకట్ రెడ్డి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాసులు, చింతా రామచంద్రారెడ్డి, మామిడికాయల హరి, శుభహాన్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.