…. కార్మికుని ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందజేసిన… మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, నిమ్మల శ్రీధర్.
గోరంట్ల సెప్టెంబర్ 11 సీమ వార్త
గోరంట్ల మేజర్ పంచాయతీలో కార్మికునిగా పనిచేసే గోపాల్ గురువారం గుండెపోటుకు గురై మృతి చెందాడన్న సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల శ్రీధర్ లు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గోపాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి టిడిపి నేత నిమ్మల శ్రీధర్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హేమ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.