…. వైసీపీ మండల అధ్యక్షులు పగడాల వెంకటేష్, పట్టణ కన్వీనర్ మేదర శంకర ఆధ్వర్యంలో సన్మానం .
సీమ వార్త అప్డేట్ న్యూస్…
గోరంట్ల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర చిన్న పత్రికల మరియు మద్యమ పత్రికల సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎంపికైన సీమ వార్త ఎడిటర్ బీరే ఈశ్వరయ్యను మండల నాయకుల వైసీపీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలోని జర్నలిస్టు ఈశ్వరయ్య నివాసంలో మండల కన్వీనర్ పగడాల వెంకటేష్ , పట్టణ కన్వీనర్ జిల్లా అధికార ప్రతినిధి మేదర శంకర, మండల వైస్ ఎంపీపీ భర్త కురుబ సత్యనారాయణ, అంబే శ్రీనివాసులు, గుడిసె నాగరాజు, తోటాల ఆరిఫ్, ప్రతాప్ రెడ్డి రవిచంద్ర రెడ్డి ల చేతుల మీదుగా పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.